Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్
నవతెలంగాణ-ఓయూ
కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికే బీఆర్ఎస్ నాటకాలను తెరమీదికి కేసీఆర్ తెచ్చాడని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. గురువారం ఓయూ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ, రాష్ట్రస్థాయి అంశాలపై కేసీఆర్‌కు ఎలాంటి స్పష్టత లేదన్నారు. అంబేద్కర్ సిద్ధాంతంతో ఏర్పడిన వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ తిరుమవలవన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తాడని ఆరోపించారు. రాష్ట్రంలో హైదరాబాదును శాసన రాజధానిగా, వరంగల్‌ను కార్యనిర్వాహక రాజధాని, ఆదిలాబాద్‌ను న్యాయవ్యవస్థ రాజధానిగాను నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలోని 140 కోట్ల ప్రజలకు పరిపాలన ఫలాలు అందాలంటే పాలన వికేంద్రీకరణ జరగాలన్నారు. ఢిల్లీ ఉత్తరాదికి, హైదరాబాద్ దక్షిణాదికి, కోల్‌కతా ఈశాన్య రాష్ట్రాలకు దేశ రాజధానులుగా ఉండాలని ప్రతిపాదించారు. సత్వర సమన్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దేశంలో ప్రతి పౌరులు పొందాలంటే సుప్రీంకోర్టు బెంచ్‌లను ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఎక్కడ చెప్పలేదన్నారు. అంతేకాకుండా చిన్న రాష్ట్రాలు, ప్రజల సమగ్ర అభివద్ధి, సుపరిపాలన అంశం పట్ల గాని ఎలాంటి స్పష్టత లేదన్నారు. కేవలం తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి, జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా పరోక్షంగా బీజేపీకి సహకరించే విధంగా బీఆర్ఎస్ను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడని, దీని దేశ ప్రజలందరూ త్వరలోనే గ్రహిస్తారని తగిన గుణపాఠం కేసీఆర్‌కు చెప్తారన్నారు. సమావేశంలో దక్షిణ భారత పరిశోధక జేఏసీ విద్యార్థి నాయకులు దుర్గం శివ, శ్రీనివాస్ పాల్గొన్నారు.