Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా సెలవుల్ని ఈనెల 26 వరకూ పొడిగించడంతో విద్యార్థుల్లో ఆందోళన
- ఈనెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నేపథ్యంలో హాస్టళ్లు ఓపెన్ చేయాలని ధర్నా
పోటీ పరీక్షల వేళ హాస్టల్స్ తెరవకుంటే ఎలా ప్రిపేర్ కావాలని ఓయూ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈనెల 10 వరకు దసరా సెలవులు ప్రకటించిన ఓయూ అధికారులు ఎందుకోగాని మళ్లీ వాటిని 26 తేదీ వరకు పొడిగించారు. ఈనెల 16న గ్రూప్‌వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు హాస్టళ్లు తెరుస్తారోనని ఎదురు చూస్తున్న విద్యార్థులు 26 వరకు సెలవులు పొడిగించే సరికి నిరాశకు గురయ్యారు. హాస్టళ్లలో ఉంటున్నది నిరుపేద విద్యార్థులే. ఎగ్జామ్స్ వేళ ప్రిపరేషన్‌కు అవకాశం లేకుండా హాస్టళ్లను మూసి వేయడంవల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులు, పోటీ పరీక్షలను, గ్రూప్-1 ఎగ్జామ్‌ను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఓయూ హాస్టల్స్‌ను తెరవాలని కోరుతున్నారు.
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు నిత్యం ఉపాధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్తూ మరొక వైపు చేతల్లో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పోటీ పరీక్షల కీలక సమయంలో హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వర్సిటీలో సమస్యలను పరిష్కరించాల్సిన వీసీ సమస్యలను సృష్టించి పెద్దగా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల ముమ్మర సన్నద్ధత
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉద్యోగ నోటికేషన్ జారీచేయడంతో ఓయూలో విద్యార్థులు అవిశ్రాంతంగా గ్రూప్-1, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమతున్నారు. అయితే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10వరకు ఓయూకు దసరా సెలవులు ఇచ్చి వాటిని ఈనెల 26 వరకు పొడగించారు. ఇలాంటి సమయంలో దసరా సెలవులను 26 వరకు పొడగించడంపై పోటీ పరీక్షలకు ప్రిపేర్ ఐతున్న వారు ఆవేదన అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు దసరా సెలవులకు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉంటూ సన్నద్ధమవుతున్నారు.
పునరుద్ధరణకు ఉద్యమం
మరి ఇలాంటి తరుణంలో అధికారులు వసథిగహలకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో గత్యంతరం లేక విద్యార్థులు మంగళవారం నుంచి రాత్రి 12 గంటలకు రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. బుధవారం ఓయూ డా.బి.ఆర్.గ్రంథాలయం నుంచి పరిపాలనా భవన్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ ధర్నా చేపట్టారు. దీనితో స్పందించిన రిజిస్ట్రార్ చర్చలు జరిపారు. వసథిగహాలు సెలవు కావడంతో మరమ్మతులు చేపట్టుతున్నట్టు చెప్పి విద్యుత్, నీటి సరఫరా చేయలేం అని ఆయన తేల్చిచెప్పారు.
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
ఓయూ అధికారులు తన హక్కుల ఉల్లంఘనకు పాల్పతున్నారని కొందరు న్యాయ విద్యార్థులు గవర్నర్, మానవ హక్కుల కమిషన్‌ను ఆన్లైన్ ద్వారా ఆశ్రయించారు. అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, హైకోర్టులో లంచ్ మేషన్ వేస్తామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేశారు. అవసరం అయితే మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం అంటూ వారు హెచ్చరించారు.
దీపాల వెలుగులో చదువుకుంటున్నాం
హాస్టళ్లలో విద్యుత్ లేక రాత్రివేళ దీపాల వెలుగులో చదువుకుంటున్నాం. దోమలు కుట్టుతున్నాయి. 16న గ్రూప్ 1 పరీక్ష ఉంటే విద్యుత్, వాటర్ సరఫరా నిలిపివేయడం సరికాదు. ఓయూ అధికారులు తమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారా? లేదా అణిచివేయాలని చూస్తున్నారా? లేదో చెప్పాలి.
-బోనాల నగేష్, ఓయూ విద్యార్థి
అన్ని హక్కుల కమిషన్లను ఆశ్రయించాం
ఈనెలలోనే లా సెమిస్టర్, గ్రూప్-1, పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఈవెంట్స్, నెట్ పరీక్షలు ఉన్నాయి. తాము విద్యుత్, నీటి సరఫరా కోసం ఉద్యమిస్తుంటే ఓయూ అధికారులు స్పందించడం లేదు. దీంతో ఆన్లైన్ ద్వారా హ్యూమన్ రైట్స్, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. విద్యుత్, నీటి సరఫరా ఇచ్చేంత వరకు ఉద్యమం చేస్తూనే ఉంటాం.
-పత్తి నరేష్, ఓయూ లా విద్యార్థి
వసతిగృహాలకు మరమ్మతులు చేస్తున్నాం
ప్రస్తుత అకాడమిక్ ఇయర్ ముగియడంతో హాస్టళ్లకు సెలవులు ఇచ్చాం. ఈనెల 26 కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. అందుకోసం వసతిగృహాలకు పలు మరమ్మతులు చేపట్టాం. విద్యార్థులు సహకరించాలి.
-ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఓయూ రిజిస్ట్రార్