Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
త్వరలోనే తిలక్‌నగర్‌లో రోడ్లు, డ్రయినేజీ పైపులైన్ నిర్మాణం చేపడతామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం నల్లకుంట తిలక్‌నగర్‌లో అధికారులతో కలిసి పర్యటించి రోడ్లు, డ్రయినేజీ వ్యవస్థ ఆధునీకీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జనాభాకు అనుగుణంగా డ్రయినేజీ పైపులైన్ వ్యవస్థ లేకపోవడంతో తరచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. రోడ్లు, డ్రయినేజీ వ్యవస్థను ఆధునీకరించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జల మండలి జీఎం శ్రీధర్, డీజీఎం సన్యాసిరావు, ఏఈలు రోహిత్, శాకీర్, జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, విశ్నేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్‌తో కలిసి కాలనీ వాసులు వెంకటేశ్వరరావు, ప్రదీప్‌రావుతో పాటు స్ధానికులు పాల్గొన్నారు.