Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భీమ్ సైనిక్ ఫౌండేషన్
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారతరత్న బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మెన్ కలకోటి సత్యనారాయణ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి దళిత, గిరిజన, ఆదివాసీ, మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా ఈ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మురళి, సిద్దిక్, మోహన్ రావు, వీరమణి, షహీదా తదితరులు పాల్గొన్నారు.