Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పారిశుధ్య కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహ గౌసోద్దీన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ కాలనీ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యక్తిగత రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... పారిశుధ్య కార్మికులు విధులలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం డివిజన్ పరిధిలోని కొత్తూరు సీతయ్య నగర్లో రూ. 50 లక్షలతో నూతనంగా సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీ సురేష్, ఎస్ఎస్ఎ అరుణ్, నరేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, రవీందర్ రెడ్డి, టి.లక్ష్మి, బస్తీ ప్రెసిడెంట్ రజాక్, శివ, యోగిరాజ్, బాలరాజ్, మొయిజ్, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్‌రావు, పారిశుధ్య కార్మికులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.