Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
సాయి నగర్ కాలనీ, కృష్ణారెడ్డి నగర్ కాలనీల పరిస్థితిపై ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వివరించిన విషయం విదితమే. సానుకూలంగా స్పందించిన మంత్రి సిఆర్‌ఎంపీ ద్వారా రూ. 10 లక్షల నిధులను మంజూరు చేయడంతో 600 ఎంఎం డయాతో 100 మీటర్ల మేర డ్రయినేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు కాలనీల ప్రజల బాధలు తీర్చడం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించామన్నారు. నిధుల మంజూరు కోసం కృషి చేసిన మంత్రి కేటార్కు కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయినగర్ కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.అచయ, విద్యార్థి నాయకుడు సంపత్, ప్రశాంత్, కృష్ణారెడ్డి నగర్ కాలనీ అధ్యక్షుడు రాజేష్ నాయక్, శేఖర్ నాయక్, శేఖర్ ముదిరాజ్, రమేష్ నాయక్, నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.