Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
మూసాపేట సర్కిల్, ఫతేనగర్ డివిజన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యల నివారణ కోసం మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు మార్గం సుగమమైందని కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ల్యాండ్ అక్విజిషన్ అధికారి సత్తార్‌ను కలిసి ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సతీష్ గౌడ్ మాట్లాడుతూ... ఫతేనగర్‌లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రస్తుతం జనాభా, వాహనాలు సంఖ్య పెరగడంతో దాని సామర్థ్యం సరిపోవడం లేదన్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందని చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ పక్కన మరో ఫ్లై ఓవర్ నిర్మించాలని గతేడాది మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆయా పనులు కొనసాగాలంటే రైల్వేశాఖ అనుమతులు అనివార్యమైనందున పనులు కొనసాగలేదన్నారు. తాజాగా రైల్వేశాఖ నుంచి అనుమతులు లభించాయని, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొలిక్కి వచ్చాయని తెలిపారు.