Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
దేశ సంస్కృతికి, నాగరీకతకు నదులు ప్రతీకలు అని చినజీయర్ స్వామి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై మోహన్ ట్రస్ట్ నిర్వహణలో భారతీయ అష్టాదశ .మహా పుణ్యానదీ వైభవం పేరిట పడునేనిమిది మంది వివిధ రంగ ప్రముఖులకు దేశంలోని వివిధ నదుల పేరిట పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ నదులలాగా జ్ఞానధారను పంచే మహనీయులను సత్కరించటం ముదావహం అన్నారు దోపిడి అన్నది మానవ సమాజంలో ఉన్నదని భూమిని నీటిని కూడా వదలకుండా విపరీతంగా మానవుడు దోపిడి చేసి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నారని అన్నారు. ప్రకతిని ప్రేమించే విద్యా విధానం కావలని అన్నారు. రాజకీయ నాయకులు కొంత మేరకు చేయగలరని విద్యావంతులు వల్లనే సమాజాన్ని చైతన్యం కాగలదని అన్నారు. పురస్కార గ్రహీతలు నటుడు సాయి కుమార్, సాహితీ వేత్తలు ఆచార్య ముదిగొండ శివప్రసాద్, వోలెటి పర్వ్యతీశం మాట్లాడుతూ దేశంలోనే నదులు పేరిట పురస్కారాలు బహుకరించటం తొలిసారి అన్నారు. వేదికపై ప్రకాష్, డాక్టర్ వెనుగోపాలా చారి, దామోదర్ గుప్త, వంశీ రామ రాజు తదితరులు పాల్గొన్నారు. గాంధీ నిర్వహణలో సుమిత్ దేవ్, సుశీల్ కుమార్, శాంతిశ్రీ తదితరులు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.