Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల తల్లిదండ్రులు
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఒక్కడు చేసిన తప్పు వల్ల వందల మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని వారేమీ తప్పు చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని బీడీఎస్ పబ్లిక్ స్కూల్లో ఈనెల 18న నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తాము ఫీజులు కట్టేసి తమ విద్యార్థులకు పాఠశాల ఒక్కసారి మూసి వేయడం వల్ల విద్యలో వెనుకబడిపోతారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ప్రాంతంలో దాదాపు నిరుపేద కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. కూలీనాలీ చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న మంచి నాణ్యత విద్యను సదువునాలను అందిస్తారని భావించి పాఠశాలకు పంపిస్తే ఎటువంటి దుర్మార్గపు కార్యకలాపాలకు పడుతున్న ఈ పాఠశాల మూసివేయాలని కొందరు కోరగా మరికొందరు తమ విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. బుధవారం రాత్రి స్థానిక కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డితో కలిసి నిరసనలో పాల్గొన్నారు. కార్పొరేటర్‌ను తమకు న్యాయం చేయాలని కోరగా ఆమె స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ మంత్రి తదితరులతో మాట్లాడి స్థానికుల సమస్యకు పరిష్కారం కనుగొంటానని హామీ ఇచ్చారు. ఒక్కసారిగా స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరుకాగా ఉధృత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకుని శాంతియుత వాతావరణం ఏర్పడే విధంగా చర్యలు చేపట్టారు. చట్టం అందరికీ సమానమే అని ప్రజలు అందరూ సహకరించాలని బంజారాహిల్స్ ఏసీపీ ఎం సుదర్శన్ ఇన్స్పెక్టర్ నరేందర్ కోరారు.