Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ హైటెన్షన్ లైన్ రోడ్డు, పాపమ్మబస్తీ రైతుబజార్ పక్కన నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు తూ, డివిజన్లోని పలు కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపాదికన పూర్తిచేసి డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సీసీ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, షౌకత్ అలీ, మున్నా, పోశెట్టిగౌడ్, ఏఈ సుభాష్, ఇంతియాజ్, కరుణాకర్, నాగేశ్వరరావు, గోపాల్, రాజుయాదవ్, క్రాంతి కుమార్, మల్లీశ్వరరావు, వీరబాబు, లక్ష్మీ, విజయలక్ష్మి, కృష్ణ, ముసలయ్య, కృష్ణంనాయుడు, రాంసింగ్ నాయక్, అబీబ్ తదితరులు పాల్గొన్నారు.