Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గం రవీంద్రచారి, కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి హాజరై కార్మికులకు కార్మిక బీమా కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ప్రమాదానికి గురైనప్పుడు ప్రమాద తీవ్రతను బట్టి బీమా సౌకర్యం పొందవచ్చునని తెలిపారు. కార్మిక బీమా ఉండడంవల్ల వారి కుటుంబానికి ప్రమాద సమయంలో ఉపయోగపడుతుందని సూచించారు. అందుకే కార్మికులు లేబర్ ఇన్సూరెన్స్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పద్ధతి లక్ష్మణ్, ఏఐటీయూసీ నాయకులు అజ్మీర్ హరిసింగ్ నాయక్, బీఓసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్, కార్మిక నాయకులు నవనీత, నారాయణ, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.