Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఏఐటీియూసీ హయత్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో కార్మికులు తప్పనిసరిగా సంక్షేమ బోర్డు పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. మండల కార్యదర్శి రామావత్ సక్రు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐటీియూసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఏఐటీియూసీ పోరాటాల ద్వారా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడినదని, అందులో ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండాలని ఆ కార్డు ద్వారా కార్మికుల కుటుంబాలకు చేదోడు అవుతుందని, అనుకోకుండా ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఆరు లక్షల ప్రమాద బీమా వస్తుందని, ఆడపిల్ల పెళ్ళికి ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. అలాగే ప్రతి కార్మికులకు 56 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే హయత్నగర్ అలాగే హయత్నగర్ కార్మికుల అడ్డా ప్రమాదకరంగా ఉందని దయచేసి అధికారులు ఈ అడ్డాను సురక్షిత ప్రాంతానికి మార్చాలన్నారు. అలాగే అడ్డాపై ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డా అధ్యక్షులు బి.శ్రీను, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి రామచంద్రు, జానీ విమల, స్వరూప, రమేష్ సూర్యరావు లతోపాటు ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.