Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లో నూతనంగా నిర్మాణం చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం చివరి దశకు చేరుకొని త్వరలో ప్రారంభానికి తుదిమెరుగులు దిద్దుకుంటుంది. ఎన్నో సంవత్సరాల కాలం నుండి ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల అభివద్ధి పథకం ద్వారా (ఎస్ఆర్డిపి) 212.5 కోట్లతో నాగోల్ చౌరస్తాలో గడిచిన రెండు సంవత్సరాల క్రితం ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న నిర్మాణం పనులు ఇప్పటికి చివరిదశకు చేరాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల సికింద్రాబాద్, ఈసీఐఎల్, యాదాద్రి, తదితర ప్రాంతాల నుండి ఎల్బీనగర్ మీదుగా వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోకుండా తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవచ్చని పలువురు అంటున్నారు. ట్రాఫిక్ సమస్య లేకపోవడమే కాకుండా సమయానికి చేరుకోవడంతోపాటు వాహనాలలో ఇంధన ఖర్చులు కూడా తగ్గుముఖంపడతాయని అంటున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ట్రాఫిక్ సమస్య తీరిపోనుండటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగోల్ డివిజన్‌కి ఈ ఫ్లైఓవర్ ఒక ప్రత్యేక అలంకరణగా మార నుందని పలువురు అంటున్నారు. 212.5 కోట్లతో ఖర్చుతో చేపట్టిన ఫ్లైఓవర్ 990 మీటర్ల ఫ్లైఓవర్ కారిడారును నిర్మించారు. 200 మీటర్ల మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించి, రెండు మార్గాలు కలిగిన ఫ్లైఓవర్ 24 మీటర్ల వెడల్పు కలిగి, ఆరు లైన్ల బై క్యారేజ్ వేను చేపట్టారు. 22 పిల్లర్లతో 22 స్పాన్లతో ఆరు వందలు మీటర్ల వయా డాక్ట్ పొజిషన్ తోపాటు 300ల మీటర్ల అప్రోచ్ పోడవు వాల్ చేపట్టారు. ఫ్లైఓవర్‌పై తారు రోడ్డుతోపాటు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో సికింద్రాబాద్ నుంచి తార్నాక, నాగోల్, ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్, ఓవైసీ, చంద్రాయణగుట్ట వరకు సిగల్ రహిత రహదారిగా మారనుంది.