Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేేసర్
స్వచ్ఛభారత్‌లో అందరూ భాగ్య స్వాములు కావాలని ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ 16వ వార్డులో తడి చెత్త - పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌లో భాగంగా గురువారం స్థానిక 16వ వార్డ్‌లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే అవగాహన కార్యక్రమం నిర్వహించామని, ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛభారత్‌లో అందరూ భాగస్వామ్యం అయ్యి పట్టణంలో పరిశుభ్రమైన వార్డుగా ముందు ఉండేలా సహకరించాలని వార్డు ప్రజలకు సూచించమని, గత కొంత కాలంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డులో చెత్త సేకరణ వాహనం ఏర్పాటు చేయగా ప్రజల్లో చైతన్యం మొదలై ప్రతి ఒక్కరు చెత్త రహిత వార్డుగా గుర్తించి ప్రతి ఒక్కరు చెత్త సేకరణ వాహనానికి చెత్త అందిస్తునందున వారికి మరొకసారి కతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఘట్కేసర్ మున్సి పాలిటీకి నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వేమనరెడ్డిని ప్రజలకు పరిచయం చేయగా కమిషనర్ సైతం ప్రజలకు మరొకసారి తడి చెత్త-పొడి చేత వేరు చేసి మన ఇంటి ముందుకు వచ్చే చెత్త సేకరణ వాహనానికి అందించినట్లయితే రోగాల నుండి మనని మనము కాపాడుకున్నవారము అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేమనరెడ్డి మున్సిపల్ మేనేజర్ అంజిరెడ్డి, స్వచ్ఛ్ సర్వేక్షన్ ప్రత్యేక అధికారి యోగేష్, మొయినార్టీ అధ్యక్షుడు కుతుబ్, వార్డు ప్రజలు షాషా బేగం, సలీం, జహంగీర్, నారాయణ హాబీబ్, విజరు, అస్లం, ఆంజనేయులు, బలరాం ఫాయుమ్, లక్ష్మి, పద్మ, సువర్ణ, శుశిల, వార్డు ఇన్చార్జి ఐలేష్ తదితరులు పాల్గొన్నారు.