Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- శామీర్‌పేటలోని బాబాగూడలో గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి
- పేద బీసీ విద్యార్థులకోసం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి గురుకుల పాఠశాలలు, మరో 30 కొత్త గురుకులాలు మంజూరు
- జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
నవతెలంగాణ-శామీర్‌పేట
ప్రయివేటు పాఠశాలలకు దీటుగా తెలంగాణలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు అందుబాటులోకి తెస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలంలోని బాబాగూడలో గురువారం నూతన మహత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని మొత్తం ఐదు లక్షల విద్యార్థులు గురుకులాల్లో విద్యానభ్యసిస్తున్నారని, ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి లక్ష ఇరవై వేల రుపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరో 30 గురుకుల పాఠశాలలు సీఎం మంజూరు చేశారని, దానిలో భాగంగా మేడ్చల్ జిల్లాకు ఒకటి మంజూరైందని వివరించారు.
శామీర్‌పేటలో గురుకుల పాఠశాల నేడు ప్రారంభిం చుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, ఫర్నీచర్, వసతి కోసం, పౌష్టికాహారం అందించ డానికి ప్రభుత్వ పాఠశాలలకు సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో రూ.7300కోట్లు మంజూరు చేశారని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం దేశంలోనే ఒక చరిత్ర అని పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని మీరు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి విజయ కమారి, ఎంపీపీ ఎల్లుభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలి, జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌గుప్తా, పాఠశాల ప్రిన్సిపాల్ సునీత, ఎంపీటీసీ డప్పు సాయిబాబా, సర్పంచ్ విలాసాగరం బాలమణి, శామీర్‌పేట మండల రైతుబంధు కమిటీ అధ్యక్షుడు కంటం క్రిష్ణారెడ్డి, శామీర్‌పేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు విలాసాగరం సుదర్శన్, సర్పంచులు, ఎంపిటిసిలు, పాల్గోన్నారు.