Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
డివిజన్లోని రాఘవేంద్రనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన యూనివర్సల్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని కార్పొరేటర్ బన్నాల గీత ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ యూనివర్సల్ కన్సల్టెన్సీ యాజమాని పుష్పరాజ్ భవిష్యత్తులో మంచిగా ఎదగాలని, ఆ భగవంతుడు వారికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని కలిగించి ఇటువంటి యూనివర్సల్ కన్సల్టెన్సీలు దేశవ్యాప్తంగా పెట్టే విధంగా వారు ఎదగాలని వారికి
శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, రాఘవేంద్ర నగర్ కాలనీ అధ్యక్షులు రోషిరెడ్డి, ఆలేరు వెంకటేశ్వర రెడ్డి, రామకష్ణ, నగేష్, సూర్య, నాయకులు ఎద్దుల కొండల్‌రెడ్డి, మహమూద్, అమాస శేఖర్, బాణాల నారాయణరెడ్డి, అలిబిలి మహేందర్, ఇస్మాయిల్, బాలు, సంతోష్, శ్యామ్, బాబు మొదలగువారు పాల్గొన్నారు.