Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్
నవతెలంగాణ-సరూర్‌నగర్
విఎంహోమ్ను మరింత అభివృద్ధి చేయాలని సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అన్నారు. మంగళవారం నాయకులతో కలిసి విఎం హోమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు పోలీస్ ట్రైనింగ్ పేరుతో ల్యాండ్ కబ్జాకి పాల్పడడానికి పూనుకున్నారన్నారు. సంవత్సరానికి కోట్ల రూపాయల ఫండ్స్, మెయిం టెనెన్స్ కొరకై ప్రజాధనాన్ని శాంక్షన్ చేస్తున్నారు. అదనంగా సినిమా షూటింగ్‌లని అదనపు లాభం ఈ డబ్బులతో జేబులు నింపుకుంటుంది ఎవరు?, ఇన్ని డబ్బులు వచ్చినా కూడా మెయింటెనెన్స్ ఎందుకు ఉండదు అని అన్నారు. ఇప్పుడు కొత్తగా పోలీస్ ట్రైనింగ్‌తో అనాధ పిల్లల భూమిపై లీడర్ల దౌర్జన్యం ఎందుకు అని ప్రశ్నించారు. పోలీస్ శిక్షణ తీసుకున్న విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తూ వి.ఎం హోంలో ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం ఏమిటని అన్నారు. విఎం హోమ్ షూటింగ్పరంగా కిరాయిలుగాను లక్షలాది రూపాయలు వస్తున్న, విఎం హోమియో చుట్టూ ప్రహరీగోడ నిర్మించలేకపోయారని అన్నారు. ప్రహరీగోడ సరిగా లేకపోవడం తో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని అన్నారు. ఈ ఆవరణలో గంజాయి, పందులు పెంచుతున్నారని, హోటల్స్ వ్యర్ధాలు పారబోస్తున్నారు అని అన్నారు. 25 శాతం భూమిని అనాధ పిల్లలకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఒక మంచి పర్యావరణంతో కూడిన స్కూల్, ఇల్లు నిర్మించాలన్నారు. మిగిలిన భూమి అంతా ప్రజల కొరకు వాకింగ్ ట్రాక్, క్రికెట్ గ్రౌండ్, డ్రింకింగ్ ఫెసిలిటీ ఒక షెల్టర్ టాయిలెట్స్‌తో మంచి పర్యావరణాన్ని కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, శ్రీధర్‌రాజ్, మూర్తి, బి.సురేష్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.