Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుర్రంగూడలో బీసీి సంక్షేమ భవన నిర్మాణం కోసం స్థలంతోపాటు నిధులు మంజూరు చేయాలని కోరుతు మంగళవారం బీసీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని ఆమె స్వగృహంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్రంగూడ గ్రామంలోని బీసీిి ప్రతినిధులు అందరూ కలిసి తాము నిర్మాణం చేయాలనుకున్న బీసీి సంక్షేమ సంఘం భవనం కోసం స్థలం, నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. గుర్రంగూడ పరిసర ప్రాంత ప్రజలకు అవసరమగు మెట్రో వాటర్, రోడ్లు, శ్మశానవాటిక కొరకు విన్నవించగా మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దడిగ రమేష్, కార్యదర్శి అప్పారావుగౌడ్, కార్యవర్గ సభ్యులు, కాలనీల గడ్డం ఎంక్లవే అసోసియేషన్ అధ్యక్షులు మధు బాబు,రవి తదితరులు ఉన్నారు.