Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మన్ పాండురంగారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులు తయారు చేసే ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మెన్ కప్పాటి పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని గ్రంథాలయ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర టీిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిశ్రమ, పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే పూర్తిగా ఎత్తివేయాలి అని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలియచేయడం జరిగిందన్నారు. మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం ఇప్పుడు చేనేత ఉత్పత్తులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంపు నిర్ణయం చేనేత రంగంపై మరణ శాసనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత, కళాకారులకు తరతరా లుగా నైపుణ్యత, సృజనాత్మకతను పదును పెడుతూ కులవృత్తి, కాళరంగాన్ని కష్టపడుతూ కాపాడుకోవాలన్న తలంపే తప్ప వ్యాపార దృక్పథం ఏ కోశానలేదని వారి చేనేత ముడిసరుకులపై, చేనేత వస్త్రాలపై వెంటనే జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.