Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇ.యాదగిరి
నవతెలంగాణ-బోడుప్పల్
ఆర్టీసీ సంస్థ మనుగడ కొరకు ఇంధన పొదుపు ఆవశ్యకత తప్పనిసరి అని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇ.యాదగిరి తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోను మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. బస్సుల పనితీరు, ఇంధన పొదుపుపై తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇంధనాన్ని పొదుపు చేయటానికి డ్రైవర్లు తీసుకోవలసిన మెళకువలపై శిక్షణ ఇచ్చారు. ఇంజన్ శక్తి తరుచు వాడటం వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుందని, వాహన శక్తిని వినియోగించడం వల్ల తక్కువ ఇంధనం ఖర్చు అవుతుందని వివరించారు. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు డ్రైవర్లు బస్సును నడిపేటప్పుడు మెరుగైన పద్ధతులను పాటించాలని సూచించారు. ఆర్టీసీ సంస్థకు అధిక ఆదాయంతో పాటు ఇంధన పొదుపు కూడా చాలా అవసరమని చెప్పారు. ఇంధనం ఎక్కువగా వాడటం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంధనాన్ని పొదుపు చేయడంతో పాటు మానవ మనవడుకు దోహదం చేసినట్టేనని అన్నారు. ఈ సందర్భంగా బస్సును నడిపే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. ఇంధనాన్ని పొదుపు చేసిన డ్రైవర్లు, ఎక్కువ ఆదాయం తీసుకు వచ్చిన కండక్టర్లకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) జానీరెడ్డి, డిపో మేనేజర్
ఎన్.ఈసు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) మురళీకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) సుబ్రహ్మణ్యం, డిపో సిబ్బంది డ్రైవర్లు, కండుక్టర్లు, మెకానిక్లు తదితరులు పాల్గొన్నారు.