Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూలో నిరుద్యోగుల ర్యాలీ
నవతెలంగాణ-ఓయూ
ఎస్ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను పూర్తిగా పరిశీలించి అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, టీఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టిన పరీక్షలలో కానిస్టేబుల్ ఎగ్జామ్లో 22 మార్కులు, ఎస్ఐ పరీక్షలో 9 మార్కులు తప్పుగా రావడం జరిగిందన్నారు. ఒక బాధ్యతయుత పదవుల్లో ఉండి ఇలాంటి తప్పుడు ప్రశ్నపత్రాలను తయారు చేసిన కమిటీ సభ్యులు వెంటనే నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. అలాగే పీసీ అభ్యర్థులకి 22 మార్కులు, ఎస్ఐ కి 9 మార్క్స్ కలిపి మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూల్ అఫ్ రిజర్వేషన్, నెగిటివ్ విధానం పై పునరాలోచన చేయాలని సూచించారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు తగిన న్యాయం చేయాలన్నారు. నిరుద్యోగ లోకానికి న్యాయం చేకూరే వరకు అవసరం ఐతే కోర్టుని ఆశ్రయిస్తామని ఉస్మానియా విద్యార్థి నాయకులు భూషణ్, సోమశేఖర్, వెంకట్ వీరమళ్లు యాదవ్ తెలిపారు.