Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపాలిటీ యాదవ సంఘం అధ్యక్షుడు వేల్పుల రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఏర్పాటు సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బాసాని యాదగిరి యాదవ్, యాదవ సంఘం స్థల దాత ఎస్బి రాజా ఉన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా యాదవులు తమ కుల పండుగగా భావించే సదర్ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటారని, కృష్ణ భగవానుడిని పూజిస్తారని తెలిపారు. అనంతరం దున్నపోతుల విన్యాసాలను, ధూం ధాం కార్యక్రమాలను తిలకించిన ముల్లిపావని జంగయ్య యాదవ్ యాదవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ బృందానికి, ఘట్కేసర్ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ యాదవ సంఘం సభ్యులు దాసరి శంకరయ్య యాదవ్, అబ్బాసాని సత్యనారాయణ, లంబ సత్యనారాయణ, కౌన్సిలర్ బత్తుల నరేష్ యాదవ్, యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి అంకం సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.