Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు నిందితుల అరెస్టు
- రూ.15.30 లక్షలతోపాటు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు, స్టాంప్స్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇన్‌కంట్యాక్స్, నేషనల్ సాయిల్ డిపార్ట్మెంట్, సౌత్ సెంట్రల్ రైల్వే శాఖతోపాటు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను టార్గెట్ చేసుకుని లక్షలు వసూలు చేస్తున్న రెండు వేర్వేరు ముఠాలకు చెందిన 8 మందిని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. రూ. 15.30 లక్షలతోపాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన నకిలీ రబ్బరు స్టాంప్స్, ఫేక్ లెటర్ ప్యాడ్స్పైన నకిలీ అపాయిట్మెంట్ లెటర్లు, అగ్రిమెంట్లు, తదితర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగర కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన ఎండీ సనావుల్లా, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఆకాశపూర్ వీర చైతన్య, పలం అశోక్ కుమార్ రెడ్డి, గొడివీర అర్జున్ రావు, తిరుమల అనిల్ కుమార్, అనిల్, శిరీషా ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిరుద్యోగులను టార్గెట్ చేశారు. ఇందుకుగాను ఏజెంట్లుగా రామస్వామి, నవీన్, మహేష్, రమేష్, హరికృష్ణా, అనిల్, సతీష్, కొండల్ అశోక్, సాయి ప్రసాద్, కేశవ్, రవి, రాజేందర్‌తోపాటు తదితరులను నియమించుకున్నారు. తమిళనాడుతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇన్‌కంట్యాక్స్ అధికారులుగా, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లుగా, ట్యాక్స్ అసిస్టెంట్ అధికారిగా నకిలీ ఐడీ కార్డులను అందించారు. అమాయకులను ఎంచుకుని ఇన్‌కంట్యాక్స్ శాఖలో 'ట్యాక్స్ అసిస్టెంట్' సౌత్ సెంట్రల్ రైల్వేలో 'గ్రూప్-సీ' ఉద్యోగాలతోపాటు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన నకిలీ రబ్బరు స్టాంప్స్, ఫేక్ లెటర్ ప్యాడ్‌పైన నకిలీ అపాయిమెంట్ లేటర్లు, అగ్రిమెంట్లు, తదితర డాక్యుమెంట్లను తయారు చేశారు. డబ్బులు చెల్లించిన వారికి పరీక్షలు నిర్వహించారు. నకిలీ అపాయింట్మెంట్ లేటర్స్‌ను జారీ చేశారు. 2020 నుంచి ఇప్పటి వరకు దాపు 1420 మందిని మోసం చేసి లక్షలు సంపాదించారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. సమావేశంలో జాయింట్ సీపీ గజారావు, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తోపాటు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్‌పాషా, ఎస్ఐలు ఎస్కే కవిదుద్దీన్, పి.మల్లికార్జున్, ఎండీ ముజఫర్ అలీ, ఎన్.రంజిత్ సింగ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.