Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
దళితులు, ముస్లింలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాలపై గళమెత్తాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. పాతబస్తీలో జరిగిన ఎస్ఐఓ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాజకీయాల్లోకి మంచివాళ్లు రాకపోతే ఆవ్యవస్థ భ్రష్టుపట్టిపోతుందన్నారు. దుర్మార్గాలపై రాజీలేనీ పోరాటం చేయకపోతే రాజకీయాలను ప్రక్షాళనం చేయలేమని అన్నారు. చెడులు, దౌర్జన్యాలను, దుర్మార్గాలపై పౌరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో ఆంగ్లేయుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎంతోమంది యోధులు రాజీలేని పోరాటాలు చేశారని పలు ఉదాహరణలు వివరించారు. సీఏఏ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ముస్లింల పోరాట పటిమ స్ఫూర్తిదాయకమన్నారు. ముస్లిమ్ పేరుంటే ఉద్యోగాలు దొరకడం గగనమని, ఇది ముస్లింల రాజకీయ బలహీనతకు నిదర్శనమన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, యూపీలో ముస్లింలు, దళితులపై జరుగుతున్న దాడులను ఉటంకించారు. ఈదాడులను చూస్తూ మౌనం వహించడం కూడా దౌర్జన్యంతో సమానమని చెప్పారు.