Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కుయుక్తులు తెలంగాణలో సాగనియ్యం
- బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి
- టీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో బీజేపీ దిష్టి బొమ్మ దహనం
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణలో కేసీఆర్ సర్కారును డబ్బు సంచులతో అస్థిరపరిచేందుకు బీజేపీ వేసిన పాచికలు పారలేదని గుజరాతీ కొనుగోలుదారులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేకపోయారని బోడుప్పల్ మున్సి పల్ కార్పొరేషన్ మేయర్ సామలబుచ్చిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ వందలాది కోట్ల రూపాయలు అశ చూపి తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ చేసిన కుటిల యత్నాలకు నిరసనగా గురువారం బోడుప్పల్ మున్సి పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మేయర్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ దేశం లోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాంగా తెలంగాణ మంచి పేరు ప్రఖ్యాతలు పొందడం జీర్ణించుకోలేని బీజేపీ నేతలు కేసీఆర్‌ను ఎదుర్కోవడం చేతకాక దొడ్డిదారిలో అమ్మకాల ద్వారా కేసీఆర్ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలుచేసేందుకు చేసిన ప్రయత్నా లను చైతన్యం కలిగిన తెలంగాణ సమాజం గుజరాతీల కుట్రలు తిప్పికొట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాలకృష్ణ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, భూక్య సుమన్ నాయక్, బింగి జంగయ్య యాదవ్, కోఆప్షన్ సభ్యులు బుర్రా దత్తాత్రేయ శాస్త్రి, టీఆర్ఎస్ నాయకులు బొమ్మకు బాలయ్య, బొమ్మకు విశ్వనాథ్, దానగళ్ల యాదగిరి, కొత్త రవిగౌడ్, కాటపల్లి రాంచంద్రారెడ్డి, బద్దుల సత్యనారాయణ, జక్క రాములు, పులకండ్ల జంగారెడ్డి, డి.కృపాసాగర్, దేశపాక దానయ్య, బి.శ్రీధర్ గౌడ్, గొపు రాములు, గఫార్, సారయ్య, ముత్యాలు, శ్రీను, శంకర్, నానాజీ తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడలో....టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కేసీఆర్ సర్కారును అస్థిరపరి చేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న బీజేపీ తీరుకు నిరసనగా పీర్జాదిగూడ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దర్గా దయాకర్ రెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కె.శివకుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.