Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
సంతోష్‌నగర్ రోడ్డు అంటే గుర్తుకు వచ్చేది రద్దీతో కూడిన ట్రాఫిక్, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చాంద్రాయణగుట్ట, సైదాబాద్, ఓవైసీ హాస్పిటల్, శంషాబద్ ఎయిర్‌పోర్టు, షాద్‌నగర్, సాగర్ కాంప్లెక్స్, బీఎన్‌రెడ్డినగర్, ఇబ్రహీంపట్నం, మాల్ తదితర ప్రాంతాలకు వెళ్ళాలంటే సంతోష్‌నగర్ ప్రధాన కూడలిగా ఉన్నది. అంతే కాకుండా వివిధ వాణిజ్య కేంద్రాలు, కళాశాలలకు ఆవాసంగా వుంది. ఎప్పుడు జనసంచారంతో, వాహనదారులతో కిటకిటలాడుతుంటుంది. యాదగిరి థియేటర్ వద్ద సైతం హోటల్ స్వాగత్ సందడిగా కనిపిస్తుంది. సంతోష్‌నగర్ ప్రధాన రోడ్డు పక్కనే హోటల్ స్వాగత్ ఉండటంతో వాహనదారులకు సరైన పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో స్వాగత్ చెందిన స్థలంతో పాటు ప్రస్తుతం హోటల్లో టీ పాయింట్ కిరణ్ షాప్ వాణిజ్య సంస్థలలో ముందు పార్కింగ్ వినియోగించేవారు. రోడ్డుకు ఇరువైపులా పెంచడంతోపాటు పార్కింగ్ పనులు చేపట్టిన నాటి నుంచి రెండు పార్కింగ్ స్థలాలు లేకుండాపోయాయి. అప్పటి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వేళ ఈ మార్గంలో వెళ్లే వారికి ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. హోటల్ స్వాగత్ సామర్థ్యానికి మించి వాహనాలు వస్తుండడంతో యజమాన్యం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు అయితే అదనంగా రోడ్లపై నిలుపుతున్న కార్లు, ద్విచక్ర వాహనదారులపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు, పాదచారాలు కోరుతున్నారు.