Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో పోలీసు విధులపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ కె సత్యనారాయణ ఆధ్వర్యంలో వనస్థలిపురం ప్రయివేట్ స్కూల్ విద్యార్థులకు పోలీసులు నిర్వహిస్తున్న బాధ్యతలను విద్యార్థులకు నేరుగా చూపిస్తూ అవగాహన కల్పించారు. అదేవిధంగా సీసీ కెమెరాలు, పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారుడు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఆపై పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు తెలియజేశారు. పోలీసులు ఆయుధాల్ని ఎప్పుడు, ఏ విధంగా ఉపయోగించాలి అనే దానిపై క్లుప్లంగా వివరించారు. నేరాలకు పాల్పడితే జీవితం అంధకారం ఏమవుతుందని, విద్యార్థి దశలోనే విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల అధిరోహించాలని, నేరాలకు దూరంగా ఉండాలని సీఐ సత్యనారాయణ విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో వనస్థలిపురం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్సై మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.