Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్లోని సర్వే నంబర్ 399లోని ప్రభుత్వ భూమికి గురువారం రెవెన్యూ అధికారులు హద్దురాళ్లను ఏర్పాటుచేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటా చారి ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమికి హద్దురాళ్లను పెట్టామని ఆర్ఐ భిక్షపతి తెలిపారు. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను ఎవరైనా తొలగించినచో క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్వేయర్ సాయి కృష్ణారెడ్డి, సిబ్బంది బాలరాజు, రాజేందర్, వీఆర్ఏ నవీన్ తదితరులు పాల్గొన్నారు.