Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
డ్రయినేజీ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేత అన్నారు. గురువారం సింగరేణికాలనీ, ఎస్.ఎన్. రెడ్డి కాలనీల్లో జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీల్లో డ్రయినేజీ రోడ్లపై ప్రవహిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైశాలీనగర్ జలమండలి, జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.