Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్. బాల మల్లేష్
నవతెలంగాణ-జవహర్నగర్
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీని మునుగోడు ఉపఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్. బాలమలేష్ పిలుపునిచ్చారు. గురువారం మల్లికార్జున్నగర్లో జరిగిన మల్కాజిగిరి మండల సీపీఐ కౌన్సిల్ సమావేశంలో ఎన్. బాలమల్లేష్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడస్తున్నా ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు పర్చడంలో విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును స్వదేశానికి తీసుకు వచ్చి ప్రతి భారతీయ కుటుంబానికి రూ. 15 లక్షలు జమ చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదన్నారు. యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలయాయ్యారని చెప్పారు. కేంద్ర బీజేపీ సర్కార్ ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఈసీని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తుందని చెప్పారు. ఈనేపథ్యంలో మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కష్ణమూర్తి, మల్కాజిగిరి మండల సీపీఐ కార్యదర్శి టి.యాదయ్య గౌడ్, సీపీఐ సహాయ కార్యదర్సులు కె. అశోక్, కాసర్ల నాగరాజు, కార్యవర్గ సభ్యులు వెంకటరమణ, జన్ను రాములు, టి.సుజాత, ఎస్.కె.అజిజ్, ఆర్.వెంకటేష్, రాములు, బి. కళమ్మ, బి.యాదగిరి, లావణ్య, కె.ప్రభాకర్, ఎం.లింగం తదితరులు పాల్గొన్నారు.