Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీర్యాల సర్పంచ్ ధర్మేందర్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చీర్యాల సర్పంచ్ ధర్మేందర్ అన్నారు. గురువారం చీర్యాల గ్రామంలోని వివిధ వార్డుల్లో రూ. 22 లక్షలతో సీసీ రోడ్లు, భూగర్భ మురికి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చీర్యాల గ్రామం కాలనీలపరంగా విస్తరించి ఉండటంతో దశలవారీగా ప్రజలకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుమల రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.