Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగారం మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని నాగారం మున్సిపల్ కమిషనర్ వాణి రెడ్డి అన్నారు. గురువారం రాంపల్లిలోని యాదాద్రి పార్కు, శిల్పానగర్, లక్ష్మీనగర్ నర్సరీలను పరిశీలించారు. పార్కులలోని మొక్కలు, వాటి సంరక్షణకు నర్సరీలలో మొక్కల ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇంజినీర్ సుదర్శనం రఘు, సానిటరీ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.