Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరు కానున్న 150 మంది ప్రతినిధులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
అఖిల భారత 131వ బ్రహ్మ సమాజం సమావేశాలకు నగరం వేదిక కానున్నది. ఈనెల 29 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ రామ్ కోఠిలోని ఈడెన్ బాగ్ కచ్చి భవన్లో అఖిల భారత బ్రహ్మ సమాజం సమావేశాలు భారీ ఎత్తున జరగనున్నాయని దక్కన్ బ్రహ్మ సమాజం అధ్యక్ష కార్యదర్సులు సి.హెచ్. కేశవ్ చంద్, అజరు గౌతమ్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ నుంచి వందలాది ప్రతినిధులు పాల్గొంటున్నారని వారు వివరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా విశేషాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ బ్రహ్మ సమాజం సభ్యులు డాక్టర్ జ్యోత్స్న ఇలియాస్, ఇలియాస్ అహ్మద్, డి. మధుబిందు, ప్రవీణ్ వేమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హైదరాబాద్ దక్కన్ బ్రహ్మ సమాజం, ఆంధ్ర బ్రహ్మ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో 27 ఏండ్ల తర్వాత జరగనున్న ఈ సమావేశాల్లో ఎక్కువగా యువత భాగస్వాములయ్యేలా నిర్వహిస్తున్నామని, దేశ భవిష్యత్, సామాజిక సంక్షేమం యువత, బాలలపై ఆధారపడి ఉందనే ఉద్ధేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రాజారామ్ మోహన్‌రారు స్థాపించిన బ్రహ్మ సమాజం అందరికి అందుబాటులోకి తీసుకు వచ్చేలా 'భవితకు ప్రోది' అనే నినాదంతో సమావేశాలు రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ సమావేశాలను 29వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ జి. చంద్రయ్య లాంఛనంగా ప్రారంభిస్తారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మావతి రాహుల్ శాస్త్రి, అలిండియా బ్రహ్మ సమాజం అధ్యక్షులు డాక్టర్ అరూప్ కుమార్, బ్రహ్మ సెంట్రల్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ వూడి పి. కష్ణ, కార్యదర్శి సౌరవ్ డే తదితరులు పాల్గొంటారని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో వివిధ అంశాలపై చర్చా వేదికలు నిర్వహించి రానున్న ఐదేళ్లకు భవిష్యత్ ప్రణాళిక రూపొందించనున్నట్లు సి.హెచ్. కేశవ్ చంద్ తెలిపారు. ఆధ్యాత్మిక విలువలు, సామాజిక సూత్రాలను ఆదర్శ భావాలను విస్తతం చేసేందుకు, మరింత మందికి చేరువ అయ్యేందుకు ఈ సమావేశాలు దోహద పడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిజిటల్ మీడియా వ్యసనం నుంచి యువతను బయటకు తీసుకు వచ్చేందుకు బ్రహ్మ సమాజం పోషించాల్సిన పాత్రపై చర్చించామన్నారు. అంతేకాకుండా మస్తీష్కమ్ అంతరదష్టి, విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, శాస్త్రీయ దక్పథం, హేతుబద్ధ ఆలోచనా సరళి, సమాజంలో రాజకీయాలు సష్టిస్తున్న ప్రభావంలో చిన్నారుల నైతిక విలువలు సామాజిక విలువలు కాపాడటంలో బ్రహ్మ సమాజం నిర్వహించాల్సిన బాధ్యత తదితర అంశాలపై విస్తతంగా చర్చించనున్నట్లు చెప్పారు. అలాగే బ్రహ్మోపాసన, సంగీతోపాసన, భజనలు, వేద పఠనం, క్విజ్ తో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని వారు వివరించారు. ఆసక్తిగల వారు విచ్చేసి ఈ సమావేశాల్లో పాల్గొనవచ్చని, బ్రహ్మ సమాజంలో సభ్యులుగా చేరవచ్చని ఆహ్వానిస్తున్నారు.