Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్ బాలరాజు
నవతెలంగాణ-ముషీరాబాద్
కర్ణాటక రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నట్లు సమన్వయ కమిటీ చైర్మెన్ బాలగౌని బాలరాజు గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ తెలిపారు. ఆర్య, ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామీజీ ఆధ్వర్యంలో కల్లుగీతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న పాదయాత్రకు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం గురువారం చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలరాజు గౌడ్, అయిలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వత్తిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తే సహించేది లేదన్నారు. కల్లును నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం తీరు సరైంది కాదన్నారు. కర్ణాటకలో 70 లక్షల జనాభా ఉన్న ఈడిగ కులస్తులు కల్లు నిషేధం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కూడా గీతా వృత్తిని ప్రోత్సహించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్దతు ప్రకటించిన వారిలో నాయకులు వెంకటేశ్ గౌడ్, కీర్తి లతాగౌడ్ తదితరులు ఉన్నారు.