Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ పావని వినరు కుమార్
నవతెలంగాణ-అడిక్మెట్
గాంధీనగర్ డివిజన్లో నూతన రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని కార్పొరేటర్ పావని వినరు కుమార్ తెలిపారు. గురువారం డివిజన్లో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీనగర్ పరిధిలోని చిన్న బజార్-ఆంధ్ర కేఫ్ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రోడ్డు చాలా ఏండ్లుగా గుంతలు పడి పూర్తిగా నడవలేని స్థితిలో ఉందన్నారు. దీంతో పాదాచారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్య పరిష్కారానికి రూ. 43 లక్షలతో వీడీ సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు వినరు కుమార్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ శ్రావణి, వర్క్ఇన్స్పెక్టర్ మహేష్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయిచంద్, బీజేపీ నాయకులు పి.నర్సింగ్ రావు, ఆకుల సురేందర్, సాయి కుమార్, అరుణ్ కుమార్, సాయి సంతోష్, అభిషేక్ పాల్గొన్నారు.