Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలి: ఏఐఎస్ఎఫ్
నవతెలంగాణ-ఓయూ
ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్చేశారు. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారని చెప్పారు. కానీ ఈమధ్య విడుదల చేసిన అర్హత పరీక్ష ఫలితాల్లో చాలామంది అభ్యర్థులు కీ పేపర్లో చూసుకున్న మార్కులకు, రిజల్ట్ చూసుకున్న మార్కులకు తేడాలు ఉన్నాయన్నారు. కొన్ని తప్పుడు ప్రశ్నలకు సమాధానం కూడా కలపలేదని, దీనివల్ల దాదాపు 1.50 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను ఏకం చేసి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి సత్యనెల్లి, సహాయ కార్యదర్శి ఉప్పల ఉదరు, కుమార్, దివ్య, మహేష్, కల్యాణ్, ఆదర్శ్, రామకృష్ణ, సతీష్, మనన్, వెంకటేష్, అంజనేయులు, రజనీకాంత్ పాల్గొన్నారు.