Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
బాల వికాస ఆధ్వర్యంలో విశ్వక్ యువ కేంద్ర న్యూఢిల్లీ సౌజన్యంతో జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థలకు 'సామాజిక వ్యాపారం' అంశంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం రాంపల్లి దయారా గ్రామంలోని బాల వికాస్ కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ శ్రీనిధి, డాక్టర్ సివి టామీ, బాల వికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరి రెడ్డి, విశ్వ యువ కేంద్ర న్యూఢిల్లీ ప్రోగ్రాం ఆఫీసర్ మంజునాథ్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ సివి టామీ, డైరెక్టర్ ఆఫ్ శ్రీనిధి నేషనల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్టార్ట్ అప్ పాలసీ గురించి, దాని ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. బచ్పన్ స్కీం పై పని చేసే స్వచ్ఛంద సంస్థలకు ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయో క్షుణ్ణంగా తెలియజేశారు. బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరి రెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో స్వచ్ఛంద సంస్థలు ఇతర దేశాల దాతలు, సీఎస్ఆర్ ఫండింగ్పై ఆధారపడకుండా సామాజిక వ్యాపారాలను ప్రారంభించి తద్వారా ప్రజల సమస్యలను తీర్చుతూ సుస్థిర అభివృద్ధితో తమ మనుగడను సాధించాలని తెలిపారు. విశ్వ యువ కేంద్ర న్యూఢిల్లీ ప్రతినిధి మంజునాథ్ మాట్లాడుతూ విశ్వయువక్ కేంద్రం ఢిల్లీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ శిక్షణలో ఎంతోమంది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తమ సంస్థలకు సామాజిక వ్యాపారాల మెలకులను తెలుసుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. ఈ శిక్షణ ద్వారా వివిధ సామాజిక వ్యాపరుల పట్ల అవగాహన పెంచుకొని ప్రజజా సమస్యలను తీరుస్తూ సుస్థిరాభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. బాలవికాస పిడిటిసి మేనేజర్ సునీత రెడ్డి మాట్లాడుతూ తమకు ఉన్న పరిజ్ఞానాన్ని శిక్షణార్థులతో పంచుకొని వారి సంస్థలకు సామాజిక వ్యాపారంలో అవసరమైన వనరుల సేకరణ, సామాజిక వ్యాపార విధానాలపై ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పది రాష్ట్రాల నుంచి 50 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.