Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత
నవతెలంగాణ-ఓయూ
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ప్రజలకు సూచించారు. గురువారం తుకారాంగేట్ అర్బన్ ప్రయిమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో తార్నాక, లాలాపేట ప్రభుత్వ దవాఖాన వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ అన్ని వయస్సుల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, యూపీహెచ్సీ వైద్య అధికారి సాయి శంకర్, సరిత, స్వరూప రాణి, ఇతర వైద్యాధికారులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.