Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
పదో పీఆర్సీ కాలపరిమితి 2023తో ముగుస్తున్నందున వెంటనే నూతన పే రివిజన్ కమిషన్ నియామకానికి చర్యలు చేపట్టాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు ఏ రాజేంద్ర బాబు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక జిల్లాల్లో నెలవారి పెన్షన్లు 12 15వ తేదీల్లో వస్తున్నాయని, ఇది చాలా అన్యాయం అన్నారు. రాష్ట్రం మొత్తం ప్రతినెల 1వ తేదీనే పెన్షన్లు బ్యాంకు ఖాతాలో జమ కావాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న మూడు కరువు బత్యాలను వెంటనే విడుదల చేయాలన్నారు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పథకాన్ని పటిష్టం చేసి నగదు రైత వైద్యం అన్ని ప్రభుత్వ ప్రయివేటు ఆస్పత్రుల్లో పెన్షనర్లకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పదో పీఆర్సీ సూచనల ప్రకారం రావాల్సిన జీవోలను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నారాయణరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ వీరస్వామి, ప్రధాన కార్యదర్శి ఎం వి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.