Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ
నవతెలంగాణ-కూకట్పల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగులకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకంలో తమకు అవకాశం కల్పించాలని కోరుతూ శేరిలింగంపల్లి వికలాంగ పట్టణ సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేందుకు తన వంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. వికలాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు గాను ఆసరా పింఛన్ ద్వారా రూ. 3,016 ఇస్తూ వారికి కొండంత అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి వికలాంగ పట్టణ సమాఖ్య అధ్యక్షులు అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు యం. ఏ సర్తాజ్, ప్రధాన కార్యదర్శి మాణ్యం సాగర్, జాయింట్ సెక్రటరీ సాగర్, కోశాధికారి లింగమ్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రేణుక, రాజేశ్వరి, నర్సింహులు, సతీష్ కుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు.