Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా 200 రోజులు పని కల్పించాలి
- జూబ్లీహిల్స్ జోన్ సీపీఐ (ఎం) నాయకులు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
హైదరాబాద్లో పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రారంభించి, ఏటా కార్మికులకు 200 రోజుల పని కల్పించాలని జూబ్లీహిల్స్ జోన్ సీపీఐ (ఎం) కన్వీనర్ అశోక్ డిమాండ్ చేశారు. శుక్రవారం యూసుఫ్గూడా, మధురానగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చిన తర్వాత హైదరాబాద్లో పనులు తగ్గిపోయాయని, కార్మికులకు పనులు లేక ఇంటికి కిరాయిలు, పిల్లల ఫీజులు కట్టలేక, నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మికులను ఆదుకోవాలని సూచించారు. అదేవిధంగా యూసుఫ్ గూడా లేబర్ అడ్డా వద్ద షెడ్డు నిర్మాణం చేయాలని, మంచినీళ్లు సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు, ఈ శ్రమ్ కార్డులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు ప్రసాద్, ఏసు, రాములు, కాజా, సైదయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.