Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ ఔట ఏకగ్రీవం తీర్మానం
నవతెలంగాణ-ఓయూ
ఓయూ పీజీ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి క్రెడిట్స్ కుదింపు సాధ్యం కాదని ఔట ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఓయూ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔట) జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేశారు. ఓయూ వీసీ యూకే పర్యటన నుంచి రాగానే ఆయన దృష్టికి తీసుకెళ్తామని అధ్యక్షుడు ప్రొఫెర్ మనోహర్ తెలిపారు. ఇక ఇప్పటికే ఓయూ అధికారులు క్రెడిట్స్ 96 నుంచి 80కి తగ్గించి అమలు చేయాలని సర్యులర్ జారీ చేసిన విషయం తెల్సిందే. మరి ఓయూ అధికారులు ఓయూ ఔట ఈ నిర్ణయం తీసుకున్న వేళా ముందుకు పోతారా ? లేక ఔట నిర్ణయం స్వాగతిస్తారా వేచి చూడాల్సిందే.
ఔట యాక్షన్ ప్లాన్ ఏంటి?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇరు ప్యానల్స్ నుంచి అభ్యర్థులు గెలిచారని, వారు ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది అంటూ ఓట కార్యవర్గాన్ని ప్రొఫెసర్స్ ప్రశ్నించారు. సీపీఎస్, యూజీసీ ఏరియర్స్ సాధన కోసం ఇప్పటికైనా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఔట ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొ. జి.మల్లేశం, ప్రొ.కె.సరస్వతమ్మ, డా.గంగాధర్, డా.రాధాకృష్ణ, డా.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..