Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీవాసులు ఎవరూ అధైర్యపడొద్దు
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అనారో గ్యానికి గురైనట్లు తెలిసింది. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు ఎమ్మెల్యే దష్టికి రావడం జరిగింది. పలు కాలనీలో ఉన్న రిజిస్ట్రేషన్ సమస్యపై 4-5 రోజుల్లో పరిష్కారం కానున్న సమయంలో ఎమ్మెల్యే కు కరోనా రావడంతో సదరు కాలనీ వాసులు రిజిస్ట్రేషన్ పరిష్కారం వాయిదా పడవచ్చు అని కాలనీవాసులు భావించినట్టు తెలియడంతో శుక్రవారం ఎమ్మెల్యే కాలనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
4-5 రోజుల్లో ఆరోగ్యం కుదుటపడుతుందని, ఒక వేళ బయటకు రాలేని పరిస్థితి ఉన్నా రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం వాయిదా వేసే సమస్యే లేదని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీిఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కావలసిన జీవో ఇచ్చి ముగింపు పలుకుతారని ఎమ్మెల్యే తెలిపారు. కాలనీవాసులు పూర్తి భాధ్యత తీసుకుని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశానికి వచ్చిన కాలనీ నాయకులు, ప్రతినిధులతో భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడమైనది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిరంజీవి, బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ టీిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కటిక అరవింద్‌రెడ్డి, న్యూటన్, యువజన విభాగం అధ్యక్షులు రాఘవేందర్రావు, వైదేహినగర్ పోగుల రాంబాబు, గుజ్జ జగన్మోహన్, బి.ఎన్.రెడ్డినగర్ డివిజన్, నాగోల్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.