Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరాంఘర్ నుంచి పాతబస్తీలోకి ఎంట్రీ
- నేడు నెక్లెస్ రోడ్డులో బహిరంగ సభ
- కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్
- పలుప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల్లో జోడో యాత్ర జోష్ నింపనుంది. ఎనిమిదేండ్లుగా నగరంలోని కార్యకర్తల్లో ఆలసత్వం, అసహనం నెలకొంది. అధికారానికి దూరమవడంతోపాటు పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయింది. అలాంటి పార్టీలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేస్తున్న జోడో యాత్రం ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
ఆరాంఘర్ నుంచి...
రంగారెడ్డి జిల్లాలో పూర్తిచేసుకుని సోమవారం రాత్రి శంషాబాద్ తండుపల్లి వద్ద బస చేసి మంగళవారం ఉదయం 9గంటలకు ఆరాంఘర్ నుంచి నగరానికి ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటలకు పురానాపూల్ వద్ద ప్రారంభమై హుస్సేపీఆలం, లాడ్‌బజార్ మీదుగా 4.30 గంటలకు చార్మినార్‌కు చేరుకోనుంది. 19 అక్టోబర్1990న రాజీవ్ గాంధీ పార్టీ పతాకాన్ని ఎగురవేసి జంట నగరాలలో సద్భావనా యాత్రా ప్రారంభించిన స్మారక స్తంభంపై రాహుల్‌గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత గుల్జార్ హౌజ్, మదీనా, నయాపూల్, ఉస్మాన్‌గంజ్, మొజాంజాహిమార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్‌గార్డెన్, అసెంబ్లీ, ఏజీఆఫీస్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా నెక్లెస్‌రోడ్ చేరుకోనుంది. సాయంత్రం నెక్లెస్‌లో సభ ఏర్పాటు చేయనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపడుతున్న జోడో యాత్ర సందర్భంగా జంటనగరాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. చార్మినార్, గుల్జార్‌హౌజ్, మదీనా, నయాపూల్, ఉస్మాన్‌గంజ్, మొజాంజాహిమార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్‌గార్డెన్, అసెంబ్లీ, ఏజీఆఫీస్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా నెక్లెస్‌రోడ్‌లో సాగే యాత్రం సందర్బంగా వాహనాలను మళ్లించనున్నట్టు నగర జాయింట్ సీపీ(ట్రాఫిక్) ఏవీ.రంగనాథ్ తెలిపారు. పలు ప్రాంతాల్లో అంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. పోలీసులు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను నిలపాలని, ఈ నేపథ్యంలో పోలీసులకు సహకరించాలని కోరారు.