Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కల్పన సూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగిందన్నారు. బయటికి వెళ్లే ప్రజలు ఉన్ని దుస్తులు ధరించాలని సూచించారు. ఇటీవల చిన్నపిల్లలకు కంటి సమస్యలు ఎదురవుతున్నాయని వీటి నివారణకు మందులు అందిస్తున్నామన్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోగులకు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తున్నామన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు. పాలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని తెలిపారు.