Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ
నవతెలంగాణ-కల్చరల్
కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే భార్యభర్తల మధ్య పరస్పర గౌరవం ముఖ్య మని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. సోమవారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో చిమ్మపూడి ఫౌండేషన్ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ప్రముఖ కవి రఘుశ్రీ రచించిన 'శ్రీమతికి ప్రేమతో' కవితా సంపుటి ఆవిష్కరణ, ప్రముఖ సాహితీవేత్త పేరంబురు రంగాచార్యకు చిమ్మపూడి జీవిత సాఫల్య పురస్కార ప్రదాన సభ జరిగింది. డాక్టర్ రమణ పాల్గొని మాట్లాడుతూ రఘుశ్రీ తన సంపుటిలో భార్యభర్తల అనుబంధాన్ని తేట తెలుగులో అందంగా చెప్పారన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ గడ్డ ఎందరో కవులు, పండితులకు అడ్డా అని అన్నారు. రంగాచార్య సంస్కృత ఆంధ్ర భాషల్లో ఉద్దండ పండితులు అని, ఆయన తెలంగాణ బిడ్డ అని కొనియాడారు. సాహితీవేత్త డాక్టర్ వోలెటి పర్వతీశం అధ్యక్షత వహించిన సభలో జర్నలిస్ట్ బాలు ఎక్కడేవర, డాక్టర్ లలితావాణి, మోహన్ పాల్గొనగా సంస్థ స్థాపకుడు చిమ్మపూడి శ్రీ రామూర్తి స్వాగతం పలికారు.