Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
తట్టిఅన్నారంలోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి హాజరై ఇంజినీరింగ్ విద్యార్థులకు స్వాగతోపన్యాసం చేశారు. విద్యార్థులు, విద్య దాని ప్రామాణికలు పాటించి, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, విద్యా ప్రామాణికతతో కూడుకున్న విద్యను అభ్యషించాలని సూచించారు. అలాగే తన నైపుణ్యతను వెలికితీస్తూ ఉన్నతగా రాణించాలని తెలిపారు. చదుకున్న చదువు, నేర్చుకున్న జ్ఞానం సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఎప్పటి కప్పుడు జరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకోవాలని సూచించారు. విద్యార్థుల యొక్క కోర్సులు, ప్రమోషన్ క్రెడిట్, వారి యొక్క హాజరు బయోమెట్రిక్ తో అనుసంధానం చేయబడిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల కార్యదర్శి చింతల రవీంద్రనాథ్ యాదవ్, వైస్ చైర్మన్ ఆనంతుల హృదయ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సాయి సత్యనారాయణ, ఏవో రాజు, ప్యాకల్టీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.