Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
నేటి సమాజంలో విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాంశేఖర్ అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఒకాబ్లరీ టెస్ట్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థులు మొదటి బహుమతి చరణ్ రెండవ బహుమతి కే రశ్మిత మూడో బహుమతి పి.ఆనంద్‌కు డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్ హెడ్మాస్టర్ చైతన్య చేతుల మీదుగా యు కెన్ విన్ అనే పుస్తకాన్ని బహుమతిగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించటానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సభిత ఇంద్రారెడ్డి సహకారంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరుగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితులున్నారు.