Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసంతోపాటు మనోధైర్యం, స్నేహసంబంధాలు పెరుగుతాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తనయుడు యువ నాయకులు పి.కౌశిక్‌రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడిపల్లి రంగనాయకుల కాలనీలో నిమ్మల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తన తల్లి నిమ్మల శారదమ్మ జ్ఞాపకార్థం యువకులకు ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని స్థానిక కార్పొరేటర్ చుక్క శివకుమార్ తో కలిసి క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. యువతి, యువకులకు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల్లో రాణించిన వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తుందన్నారు. ఈ క్రికెట్ పోటీలలో ఏడు టీములు పాల్గొంటున్నాయని వివరించారు. ఈ కార్యక్ర మంలో నాయకులు స్వామి ముదిరాజ్, చంద్రశేఖర్, కృష్ణ, గండికోట రాము, మోహన్, వెంకటయ్య, బాబుబై, సతీష్ తదితరులు పాల్గొన్నారు.