Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా వీఎం హోం భూములు అమ్ముతామంటూ ప్రచారం
నవతెలంగాణ- సరూర్‌నగర్
అనాధల భూములపై కొంత మంది పెద్దల కన్ను పడింది. విలువైన ఈ భూములను ఎలాగైనా చేజిక్కించుకోవాలని బావిస్తు న్నారు. కలెక్టర్, హెచ్ఎండీల నుంచి ఎన్ఓసీ కూడా తీసుకున్నట్లు చెప్పి.. ఆ భూములను విక్రయించేందుకు యత్ని స్తున్నారు. తాజాగా ఓ రియల్టర్‌తో ఈ భూములను అమ్మకానికి యత్నిం చారు. పూర్వ విద్యార్థులు సదరు రియల్టర్‌ను గుర్తించి హోం సిబ్బందికి అప్పగించారు. గతంలో ఈ భూమిని రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కేటాయించగా, పూర్వవిద్యార్థులు అడ్డుకున్నారు. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం ఈ భూముల్లో పోలీసు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు యత్నించగా, పూర్వవిద్యార్థులు అడ్డుకోవడం విశేషం. 120 ఏళ్లుగా అనాథóలకు ఆశ్రయం కల్పించిన ఈ భూములు ప్రస్తుతం హారతి కర్పూరంలా కరిగిపోతుండటంపై ప్రత్యేక కథనం.
రక్షణ కల్పించాల్సిన వారే..భక్షిస్తున్న వైనం
భూములకు రక్షణ కల్పించి, అనాధలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిధుల లేమి సాకుతో విలువైన ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికే రిలయన్స్ పెట్రోల్ బంక్, రైతుబజార్, బీజేఆర్ భవన్లకు లీజు ప్రాతిపదికన భూములు కేటాయించింది. వీటిలో ఒక్క రైతు బజార్ నుంచే రూ.5కోట్లు అద్దె రూపంలో రావాల్సి ఉంది. ఇక పెట్రోల్ బంక్ నుంచి ఎంత వసూలు కావాలనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంతేకాదు ఈ భూములకు రక్షణ లేకపోవడంతో ఆక్రమణలకు గురవు తుండటమే కాకుండా డంపింగ్‌యార్డ్‌గా మారింది.
ఇప్పటివరకు వరకు 50 వేల మందికిపైగా..
అప్పటి నిజాం మీర్‌మహబూబ్ ఆలీఖాన్ తన భార్య జ్ఞాపకార్థం అనాథóల కోసం సరూర్‌నగర్ మండల పరిధిలోని సర్వే నెంబర్ 6, 7, 8, 9లతో మొత్తం 73.3 ఎకరాలు కేటాయించారు. 1901లో రెండు అంతస్థుల భవనం నిర్మిం చారు. తల్లిదండ్రులు లేని అనాథóలకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తు న్నారు. ఒకటో తరగతి నుంచి ఎస్ఎస్సీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఇక్కడ సుమారు 50 వేల మందికిపై అనాథలకు ఆశ్రయం పొందారు. స్కూలుతో పాటు ఆటల స్థలం, హాస్టల్ వంటి సదుపాయాలు కూడా ఉండ టంతో అనాధ విద్యార్థులు ఇక్కడ చదువుకునేందు కు ఎక్కువ ఇష్టపడేవారు. ఇలా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనాధ లే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఇక్కడ ఉంటారు. 2008 వరకు వృత్తి విద్యా కోర్సులను కూడా అందజేశారు.
భూములపై కన్నేసిన కబ్జాదారులు
హోమ్స్ భూములు జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం, ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా సాగుతుండటంపై కబ్జాదారులు, ప్రయివేటు వ్యాపారుల కన్ను ఈ భూములపై పడింది. ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో ఈ భూములపై గద్దల్లా వాలిపోతున్నారు. లీజు పేరుతో భూములను కొల్లగొడు తున్నారు. తీరా వాటి అద్దెలు కూడా చెల్లించడంలేదు. కొంత మంది ఏకంగా సర్వే నెంబర్లకు బై యాడ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం కూడా చూసీచూడనట్లుగా వ్యవహరి స్తుంది. నిజానికి ట్రస్ట్ నిబంధనల ప్రకారం ఈ భూములను అమ్మడం, కొనడం, లీజుకు ఇవ్వడం నిషేధం కానీ, ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ఆశ్రమానికి నిధుల సమీకరణ పేరుతో విలువైన ఈ భూములను లీజు ప్రతిపాదికన ప్క్రెవేటు వ్యక్తులకు అప్పగించేందుకు యత్నిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
ఆ అధికారం లేదు
విక్టోరియా మెమోరియల్ ట్రస్ట్ భూములను కేవలం విద్య కోసమే ఉపయోగించాలి. ఈ భూముల ను లీజుకు ఇచ్చే అధికారం ప్రభు త్వానికి లేదు. రాచకొండ కమిషన రేట్‌కు భూమి కేటాయించిన కేసులో హైకోర్టు ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. భూములు ఆక్రమించి భవనాలు నిర్మించిన వారిపై కేసులు నమోదు చేయాలి. వాటిని స్వాధీనం చేసుకోవాలి. శిథిలావస్థకు చేరిన ఈ చారిత్రక భవనానికి మరమ్మతులు నిర్వహించి పూర్వ వైభవం కల్పించాలి.
-బీమగాని మహేష్, పూర్వ విద్యార్థి